Amisha Patel: చిక్కుల్లో 'బద్రి', 'నాని' హీరోయిన్ అమీషా పటేల్!

షార్ట్స్‌లో చూడండి
'బద్రి', 'నాని' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువై, గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న బాలీవుడ్ భామ అమీషా పటేల్‌ కొత్త చిక్కుల్లో ఇరుక్కుంది. ఓ వివాహ వేడుకలో నృత్యం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని డబ్బు తీసుకున్న ఆమె, కార్యక్రమానికి రాలేదంటూ ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ చీటింగ్ కేసు పెట్టింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌ లోని మొరాదాబాద్‌ లో ఓ ఈవెంట్ సంస్థ ప్రతినిధి పవన్‌ శర్మ, అమీషా పటేల్ తో డీల్ కుదుర్చుకున్నాడు. పెళ్లిలో డ్యాన్స్ చేసేందుకు రూ. 11 లక్షలను అడ్వాన్స్ గా కూడా ఇచ్చాడు. అయితే, అమీషా ఈ వేడుకకు హాజరు కాలేదని, మరో రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని పవన్ ఆరోపించారు.

అమీషా వ్యవహారంతో తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని, డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా అడిగితే, చంపేస్తానని బెదిరింపులకు దిగిందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, అమీషా సహా మరికొందరిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. మార్చి 12లోగా కోర్టుకు హాజరు కావాలని అమీషాకు నోటీసులు పంపారు.
Go Back to Shorts
Amisha Patel
Marriage
Dance
Court
Badri
Nani

More Telugu News