చంద్రబాబు సామాజిక వర్గం నాకు ఎన్నో అవాంతరాలు సృష్టించాలని చూసింది: ఆమంచి ఆరోపణలు

  • ఈ విషయాన్ని లోకేశ్, పరిటాల సునీతకు చెప్పాను
  • అయినప్పటికీ, వారు స్పందించ లేదు  
  • నాపై, అనుచరులపై 170 అక్రమ కేసులు పెట్టారు
ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ టీడీపీపైన, ఆ పార్టీ నేతలపైన తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు తనకు ఎన్నో అవాంతరాలు సృష్టించాలని చూశారని ఆరోపించారు. ఈ విషయాన్ని మంత్రులు నారా లోకేశ్, పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని, తాను టీడీపీలోకి వచ్చాక, అంటే, ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో తనపైన, తన అనుచరులపైనా 170 అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. 
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
aamanchi
NTR
Nara Lokesh
parital sunitha

More Telugu News