'ఏంట్రా, నీ పాకిస్థాన్ గొప్పతనం' అంటూ మండిపడిన యాంకర్ రష్మీ
- ఆయన పాకిస్థాన్ వెళ్లిపోవలసింది
- మాతోనే నీ అస్తిత్వమని మరిచిపోకు
- దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి సిగ్గులేదా?
ఈ నేపథ్యంలోనే భారత్ లోనే ఉంటూ కొందరు పాకిస్థాన్ కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలాంటివారిపై కూడా నెటిజన్లు మండిపడివుతున్నారు. మాజీ క్రికెటర్ 'సిద్ధూ' మాట్లాడుతూ "ఉగ్రవాదానికి దేశంతో గానీ .. మతంతో గాని సంబంధం లేదు" అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని రేపుతున్నాయి.
ఈ విషయంపై యాంకర్ రష్మీ స్పందిస్తూ .. 'పాకిస్థాన్ కి అనుకూలంగా మాట్లాడుతోన్న సిద్ధూ .. దేశ విభజన సమయంలో అక్కడికే వెళ్లిపోవలసింది. దురదృష్టవశాత్తు ఆయన ఇప్పటికీ ఇక్కడే ఉండిపోయారు' అంటూ అసహనాన్ని ప్రదర్శించింది. ఇక 'పాకిస్థాన్ ఆర్మీ జిందాబాద్' అంటూ షోయెబ్ హఫీజ్ అనే నెటిజన్ ట్వీట్ కి రష్మీ స్పందిస్తూ ..'సాలే .. ఏంట్రా నీ పాకిస్థాన్ గొప్పతనం? .. మాతోనే నీ అస్తిత్వం .. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి సిగ్గులేదా? మూసుకుని కూర్చో .. లేదంటే పాకిస్థాన్ కి వెళ్లిపో' అంటూ మండిపడింది.