పశ్చిమ బెంగాల్ లో తుపాకీ ఎక్కుపెట్టి.. బీజేపీ నేత కుమార్తె కిడ్నాప్
- ఐదు నెలల క్రితం టీఎంసీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన నేత
- 22 ఏళ్ల కుమార్తెను కిడ్నాప్ చేసిన దుండగులు
- రాజకీయ కోణం ఉన్నట్టు ఆధారాలు లేవన్న ఎస్పీ
ఈ నేపథ్యంలో, సుప్రభాత్ సోదరుడు సుజిత్ మాట్లాడుతూ... ఐదుగురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించారని... మమ్మల్నందరినీ తొలుత ఓ గదిలో ఉంచి బయట తాళం వేశారని చెప్పారు. ఆ తర్వాత తుపాకిని ఎక్కుపెట్టి ఇంటిబయట ఉంచిన కారు వద్దకు లాక్కెళ్లి, ఆమెను తీసుకెళ్లిపోయారని తెలిపారు.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. దీని వెనుక రాజకీయ కోణం ఉన్నట్టు ఆధారాలు లభించలేదని అన్నారు.