Jammu And Kashmir: పుల్వామా దాడి ఎఫెక్ట్.. పాక్‌కు అమెరికా హెచ్చరిక

  • ఉగ్రవాదులకు మద్దతు ఆపేయండి
  • మీ భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం వద్దు
  • ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌తో కలిసి ముందుకు

పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రదాడిని ఖండించిన అమెరికా.. పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాదులకు వెంటనే మద్దతు ఆపేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పాక్ భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించరాదని కోరింది. ఉగ్రవాద నిర్మూలనకు భారత్-అమెరికాలు కలిసి పనిచేస్తాయని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ పేర్కొన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపారు.

ఉగ్రవాదం నిర్మూలనలో భారత్‌కు అమెరికా అండగా ఉంటుందన్నారు. కాగా, దాడి వెనక పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ హస్తం ఉండే అవకాశం ఉందని అమెరికా రక్షణ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా పౌరులెవరూ పాక్‌లో పర్యటించవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

More Telugu News