chaitu: నాగచైతన్యతో దిల్ రాజు మూవీ ఖరారు

  • ముగింపు దశలో 'మజిలీ'
  • సెట్స్ పైకి వెళ్లిన 'వెంకీమామ'
  • ఆ తరువాత సినిమా శశితో      

ఆ మధ్య గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ తో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో దిల్ రాజు రంగంలోకి దిగారు. అయితే కొన్ని కారణాల వలన ఆయన మనసు మార్చుకున్నారనీ, ఆ ప్రాజెక్టును నాగచైతన్యతో చేయనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్త నిజమేనన్నది తాజా సమాచారం.

దిల్ రాజు నిర్మాణంలో .. శశి దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి అంగీకరిస్తూ చైతూ రీసెంట్ గా అగ్రిమెంట్ చేశాడట. కథా కథనాల్లోని కొత్తదనం కారణంగా ఈ సినిమా చేయడానికి చైతూ అంగీకరించాడని చెబుతున్నారు. ప్రస్తుతం చైతూ శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోగా, ఇటీవలే 'వెంకీమామ' మొదలైంది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా పూర్తయిన తరువాత చైతూ .. శశితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

More Telugu News