sensex: వరుసగా ఆరో రోజు నష్టపోయిన సెన్సెక్స్

  • దేశీయ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాల పర్వం
  • 157 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 47 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. సెన్సెక్స్ వరుసగా ఆరో రోజు నష్టపోయింది. ముఖ్యంగా ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం స్టాకులు నష్టపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 157 పాయింట్లు కోల్పోయి 35,876కు పడిపోయింది. నిఫ్టీ 47 పాయింట్లు పతనమై 10,746 వద్ద స్థిరపడింది. ఈ ఉదయం మిక్స్ డ్ గా మార్కెట్లు ప్రారంభమైనప్పటికీ... ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ లో భారతి ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియాలు టాప్ లూజర్స్ గా ఉన్నాయి. యస్ బ్యాంక్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాలను నమోదు చేశాయి.

More Telugu News