ram: రామ్ సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్

  • మాస్ లుక్ తో రామ్ 
  • యాక్షన్ సీన్స్ చిత్రీకరణ
  •  'నోరాఫతేహి'తో ఐటమ్ సాంగ్         

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ రఫ్ లుక్ తో కనిపిస్తూ .. మాస్ ఆడియన్స్ లో ఆసక్తిని రేపుతున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో పూరి - మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే .. 'అంటూ సాగిన ఐటమ్ సాంగ్ ఇప్పటికీ కుర్రాళ్ల గుండెల్లో సందడి చేస్తూనే వుంది. ఆ ఐటమ్ సాంగ్ కి మించిన ట్యూన్ చేయమని పూరి చెప్పడంతో .. మణిశర్మ ఆ పనిని పూర్తిచేశాడని అంటున్నారు. త్వరలోనే 'నోరా ఫతేహి'పై ఈ ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News