bandi saroj kumar: సురేశ్ బాబుగారిని చూస్తే నాకు ఆ విషయం అర్థమైంది: దర్శకుడు బండి సరోజ్ కుమార్

  • సురేశ్ బాబుగారిని కలిసే ఛాన్స్ వచ్చింది 
  • ఆయనను ఒక రేంజ్ లో ఊహించుకుని టెన్షన్ పడ్డాను
  • సింపుల్ గా ఉండటం చూసి షాక్ అయ్యాను
నటుడు .. దర్శకుడు బండి సరోజ్ కుమార్, తన తొలి సినిమా విషయంలో ఎన్ని ఇబ్బందులు పడింది ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో ఆయన ప్రముఖ నిర్మాత సురేశ్ బాబును గురించి ప్రస్తావించాడు. " నిర్మాత నల్లమలుపు బుజ్జిగారి ద్వారా నేను సురేశ్ బాబుగారిని కలిసే అవకాశం వచ్చింది. సురేశ్ బాబుగారు యూఎస్ లో చదువుకుని వచ్చారు గనుక, ఆయన ఒక రేంజ్ లో ఉంటారని అనుకున్నాను.

కథ ఎలా చెప్పాలనే విషయంపై బాగా కసరత్తు చేసి వెళ్లాను. తీరా వెళ్లి చూస్తే ఆయన చాలా సింపుల్ గా వున్నారు. ఆ సమయంలో నానక్ రామ్ గూడాలో 'తులసి' సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమా సెట్లోకి అత్యవసరంగా గడపలు అవసరమయ్యాయి. నన్ను వెంటబెట్టుకుని సురేశ్ బాబుగారు శిల్పకళావేదిక దగ్గరికి వెళ్లి, ఆ గడపలను కారుపై కట్టి అక్కడి నుంచి సెట్ కి తీసుకొచ్చారు. ఆ గడపలను ఆయన స్వయంగా భుజాన వేసుకుని మోయడం చూసి ఆశ్చర్యపోయాను. గొప్ప పారిశ్రామిక వేత్త కావాలంటే .. గొప్పకార్మికుడివి కావాలనే విషయం ఆయనను అలా చూసిన తరువాత అర్థమైంది" అని చెప్పుకొచ్చాడు.
bandi saroj kumar

More Telugu News