modi: భారీ వర్షం.. నాలుగు గంటల పాటు విమానాశ్రయంలోనే ఉండిపోయిన మోదీ

  • పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఉత్తరాఖండ్ వెళ్లిన ప్రధాని
  • భారీ వర్షం కారణంగా డెహ్రాడూన్ విమానాశ్రయంలో ఉండిపోయిన మోదీ
  • పరిస్థితి మెరుగుపడిన తర్వాత బయటకు రాక
ప్రధాని మోదీ దాదాపు నాలుగు గంటల సేపు విమానాశ్రయంలోనే ఉండిపోయారు. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరాఖండ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు డెహ్రాడూన్ లోని జోలీ గ్రాన్ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అయితే, భారీ వర్షం కారణంగా విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేందుకు వీలుపడలేదు. దీంతో, విమానాశ్రయంలోనే ఆయన ఉండిపోయారు. పరిస్థితి మెరుగుపడిన అనంతరం ఆయన ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చారు. విమానాశ్రయంలోని ఓ ప్రత్యేక గదిలో ప్రధాని ఉన్నారని అధికారులు తెలిపారు. 
modi
Uttarakhand
dehadoon
airport

More Telugu News