lawrence: అనుకున్నదానికంటే ముందుగానే 'కాంచన 3'

  • లారెన్స్ నుంచి 'కాంచన 3'
  • ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ ఏప్రిల్ 18
  • వారం ముందుగానే విడుదల చేసే ఛాన్స్     

నృత్య దర్శకుడిగా .. దర్శకుడిగా .. నటుడిగా లారెన్స్ సక్సెస్ అయ్యాడు .. తమిళ - తెలుగు భాషల్లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అలాంటి లారెన్స్ నుంచి హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన 'కాంచన' .. 'గంగ' సినిమాలు భారీ వసూళ్లను రాబడుతూ ఘన విజయాలను అందుకున్నాయి. దాంతో లారెన్స్ నుంచి ఆ తరహా సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో 'కాంచన 3'తో లారెన్స్ మళ్లీ రంగంలోకి దిగాడు. చకచకా ఈ సినిమా పనులు జరిగిపోతున్నాయి. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 18వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన 12వ తేదీకి విడుదలను మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజునే సాయిధరమ్ తేజ్ సినిమా 'చిత్రలహరి' రిలీజ్ వుంది. ఇక నాని మూవీ 'జెర్సీ' కూడా ఈ తేదీకే ఫిక్స్ అయ్యే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది.  

More Telugu News