ఆ క్రికెటర్‌పై జీవితకాల నిషేధం విధించే అవకాశం: డీడీసీఏ చీఫ్ రజత్ శర్మ
- అండర్-23 జట్టుకు ఎంపిక చేయలేదన్న కక్ష
- సెలక్టర్ అమిత్ భండారీపై గూండాలతో దాడి
- అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు అనూజ్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఈ ఘటనపై డీడీసీఏ చీఫ్ రజత్ శర్మ మాట్లాడుతూ.. నేడు బోర్డు సభ్యుల సమావేశం అనంతరం అనూజ్‌పై ఎటువంటి చర్య తీసుకోవాలనేది నిర్ణయిస్తామన్నారు. అతడిపై జీవితకాల నిషేధం విధించే అవకాశమే ఎక్కువగా ఉందన్నారు. అతడు చేసిన దానికి తీవ్రమైన శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.