Narendra Modi: నరేంద్ర మోదీ బయోపిక్ లో అమిత్ షా పాత్ర లుక్ ఇదిగో!

  • 'పీఎం నరేంద్ర మోదీ' పేరుతో తెరకెక్కుతున్న చిత్రం
  • మోదీ పాత్రను పోషిస్తున్న వివేక్ ఒబెరాయ్
  • 23 భాషల్లో విడుదలకానున్న చిత్రం
ప్రధాని మోదీ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'పీఎం నరేంద్ర మోదీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. మోదీ పాత్రను ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ పోషిస్తున్నాడు. మోదీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అమిత్ షా పాత్రను మనోజ్ జోషి పోషిస్తున్నారు.

హిందీ, తెలుగు, తమిళంతో పాటు 23 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. వివేక్ ఒబెరాయ్ తండ్రి సురేష్ ఒబెరాయ్, సందీప్ సింగ్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Narendra Modi
pm
biopic
bjp
bollywood

More Telugu News