Amanchi Krishnamohan: చంద్రబాబుకు రాసిన రాజీనామా లేఖలో ఆమంచి ఏం చెప్పారంటే..!

  • ప్రభుత్వ కార్యకలాపాల్లో సంబంధం లేని శక్తులు
  • చీరాలలో కల్పించుకుంటున్నాయి
  • రాజీనామా లేఖలో ప్రస్తావించిన ఆమంచి
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, తన రాజీనామా లేఖలో సంబంధం లేని శక్తులు ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయని ఆరోపించారు.

"తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి గారికి...
చీరాల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతములలో మరియు ప్రభుత్వ కార్యకలాపాల్లో పార్టీ మరియు ప్రభుత్వానికి ఏ మాత్రమూ సంబంధము లేని కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను.
ఇట్లు,
ఆమంచి కృష్ణమోహన్
శాసనసభ్యులు
చీరాల నియోజకవర్గం"
అని తన రాజీనామా లేఖలో ఆమంచి పేర్కొన్నారు. 
Amanchi Krishnamohan
Resign
Chandrababu
Letter

More Telugu News