West Bengal: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతకు వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో పోస్టర్లు

  • ప్రజాస్వామ్య భారత్‌లో మీరు దాదా గిరీ చేయొద్దంటూ వ్యాఖ్యలు
  • నేడు ఢిల్లీ వస్తున్న ఫైర్‌బ్రాండ్‌
  • ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ దీక్షకు సంఫీుభావం

‘మనది ప్రజాస్వామ్య భారతదేశం. ఈ భారత దేశ రాజధానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కానీ దయచేసి మీ దాదాగిరిని కోల్‌కతాలోనే వదిలేయండి. ఇక్కడికి మాత్రం తీసుకురావద్దు’...ఢిల్లీ వీధుల్లో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ వెలసిన పోస్టర్లు ఇవి.

 ‘సేవ్‌ యూత్‌ డెమోక్రసీ’ పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీ రాష్ట్ర సమస్యల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ నేడు దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షకు సంఫీుభావం తెలిపేందుకు మమతా బెనర్జీ ఈరోజున ఢిల్లీ వస్తున్నారు. ఆమె రాకను దృష్టిలో పెట్టుకుని ఈ పోస్టర్లు వెలసినట్లు భావిస్తున్నారు.

ఇటీవల ‘సేవ్‌ కంట్రీ, సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి వ్యతిరేకంగా కోల్‌కతాలో మూడు రోజులపాటు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ ఇంటిపై సీబీఐ దాడులను నిరసిస్తూ ఆమె దీక్ష చేపట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాల అనంతరం దీక్ష విరమించారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒకే వేదికపై తెచ్చి రాష్ట్రంలో మెగా సభ కూడా నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఢిల్లీకి వస్తున్న మమతకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడం చర్చనీయాంశంగా మారింది.

More Telugu News