Allu Bhanumathi: జనసేన తీర్థం పుచ్చుకున్న విశాఖ మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి

విశాఖపట్టణం మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆమెతో పాటు ఆమె మనవడు యర్రా రఘురాజ్, నగర మాజీ కార్పొరేటర్ యర్రా సన్యాసినాయుడు తదితరులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 1985లో భానుమతి విశాఖ‌-1 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో భానుమతి తదితరులకు పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Allu Bhanumathi
Pawan Kalyan
Janasena
Visakhapatnam
Raghuraj
Sanyasinaidu

More Telugu News