nani: 'జెర్సీ'కి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారట

  • రంజీ క్రికెట్ నేపథ్యంలో సాగే కథ
  •  క్రికెటర్ గా కనిపించనున్న నాని
  •  ఈ నెల 14న ఫస్టు సాంగ్ రిలీజ్  

నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. రంజీ క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ కథలో నాని క్రికెటర్ గా కనిపించనుండగా, ఆయన సరసన నాయికగా శ్రద్ధా శ్రీనాథ్ అలరించనుంది. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాను ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చాలా రోజుల క్రితమే ప్రకటించారు.

అయితే ఆ తేదీ కంటే ముందుగానే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి తాజాగా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 5వ తేదీన గానీ .. 12వ తేదీన గాని ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారట. అయితే 5వ తేదీన 'మజిలీ' .. 12న 'చిత్రలహరి' సినిమాలు వున్నాయి. ఈ రెండు సినిమాల్లో 'జెర్సీ' ఏ సినిమాకి పోటీ అవుతుందో చూడాలి మరి. ఇక ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News