సహనం కోల్పోయిన హిమాచల్ ప్రదేశ్ సీఎం.. కాంగ్రెస్ నేతపై అసెంబ్లీలో మండిపాటు
- ఓ పథకం గురించి మాట్లాడుతుండగా అడ్డుతగిలిన కాంగ్రెస్ సభ్యుడు
- తమ హయాంలోనే ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చామన్న వైనం
- జోక్యం చేసుకోకుండా కూర్చోవాలని హెచ్చరించిన సీఎం
సీఎం మాట్లాడుతుండగా మధ్యలో కల్పించుకున్న అగ్నిహోత్రి.. ఇదేమీ కొత్తకాదని, ‘ప్రశాసన్ జనతా కే ద్వార్’ పేరుతో కాంగ్రెస్ హయాంలోనే ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చామని అన్నారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం.. సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ హన్స్‌రాజ్‌ను ఉద్దేశించి.. సభలోని సభ్యుడెవరూ ఇలా జోక్యం చేసుకోవద్దంటూ ఒకింత ఆగ్రహంగా చెప్పారు. మరోసారి ఇలా జోక్యం చేసుకోవద్దని, కూర్చోవాలని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, సీఎం తీరుపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.