Tripura: మహిళా మంత్రితో మరో మంత్రి అసభ్య ప్రవర్తన... అట్టుడుకుతున్న అగర్తల!

షార్ట్స్‌లో చూడండి
తాను బాధ్యతగల హోదాలో ఉన్నానన్న సంగతిని మరచిన త్రిపుర మంత్రి ఒకరు, సాటి మహిళా మంత్రిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల జరిగిన బీజేపీ ర్యాలీలో రాష్ట్ర మంత్రి మనోజ్ కాంతిదేవ్ మరో మంత్రి సంతను చక్మాతో అనుచితంగా ప్రవర్తించగా, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సాటి మంత్రితో అసభ్యంగా ప్రవర్తించిన ఆయన రాజీనామా చేయాలంటూ ఐద్వా (ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్) అగర్తలాలో భారీ ర్యాలీ నిర్వహించింది. పట్టపగలు ప్రధాని పాల్గొన్న సమావేశంలో ఈ తరహాలో వ్యవహరించడం మహిళలను తీవ్రంగా అవమానించడమేనని మహిళా సంఘాల నేతలు మండిపడ్డారు. తక్షణం మంత్రిని అరెస్ట్ చేయాలని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో బీజేపీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Go Back to Shorts
Tripura
Agartala
Minister

More Telugu News