Andhra Pradesh: నేను పుట్టేనాటికే తాత ముఖ్యమంత్రి.. పెరిగేటప్పుడు నాన్న ముఖ్యమంత్రి!: నారా లోకేశ్

  • నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు
  • ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను
  • వైసీపీ బీజేపీతో రాజీపడి నామాలు పెట్టింది

తాను పుట్టేనాటికే తాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారనీ, తాను పెరిగేటప్పుడు తండ్రి చంద్రబాబు సీఎంగా ఉన్నారని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అమెరికాలో తాను చదువుకున్నాననీ, ప్రపంచ బ్యాంకులో రెండేళ్ల పాటు ఉద్యోగం చేశానని వెల్లడించారు. ఇన్నేళ్లలో తనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిన్న గుంటూరు సభలో ‘సన్ రైజ్’ అంటూ పదేపదే విమర్శించడంపై లోకేశ్ స్పందించారు.

ప్రజలకు సేవ చేయాలనే తాను రాజకీయాల్లోకి వచ్చానని లోకేశ్ తెలిపారు. చంద్రబాబు, ఆయన మంత్రివర్గం పనితీరు వల్లే ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం కట్టిన పన్నులనే నిధుల రూపంలో తిరిగి ఇస్తున్నారనీ, ప్రత్యేకంగా ఏమీ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం రాగానే ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీతో వైసీపీ నేతలు రాజీ పడి ఏపీ ప్రజలకు నామాలు పెట్టారంటూ వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఆయన వ్యాఖ్యానించారు. 

More Telugu News