Andhra Pradesh: జగన్.. మీ ఉద్దేశాలు, నిజాయితీని ఏపీ ప్రజలు శంకిస్తున్నారు!: కింజరపు రామ్మోహన్ నాయుడు

  • వైసీపీ అధినేతపై మండిపడ్డ టీడీపీ నేత
  • ప్రత్యేకహోదా కోసం ఏం చేశారని ప్రశ్న
  • మోదీ అబద్ధాలకు మద్దతిస్తున్నారని మండిపాటు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ లోక్ సభ సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం అందరూ పోరాడుతుంటే మౌనంగా మోదీకి మద్దతు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా కోసం అసలు ఏం చేశారని జగన్ ను నిలదీశారు.

ఈరోజు ట్విట్టర్ లో రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ..‘@ysjagan @Ysrcp.. ఏపీ ప్రజలు మీ నిజాయితీని, ఉద్దేశాన్ని శంకిస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం మీరు ఏం చేశారు? ఏపీకి ఇచ్చిన హామీల అమలులో విఫలమైన మోదీ, ఆయన అబద్ధాలను మీరు సపోర్ట్ చేస్తున్నారా?’ అని ట్వీట్ చేశారు. దీనికి #APDemandsJustice అనే హ్యష్ ట్యాగ్ ను జతచేశారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Special Category Status
YSRCP
Jagan

More Telugu News