Chandrababu: మోదీ వ్యతిరేక కూటమిలో ముందుంటాం: చంద్రబాబు దీక్షకు దీదీ సంఫీుభావం

  • విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో బాబు దీక్ష
  • పార్టీ ప్రతినిధి డెరెక్‌ ఓబ్రీన్‌ ద్వారా మద్దతు ప్రకటించిన మమత
  • ఇటీవల కోల్‌కతాలో మమత చేపట్టిన దీక్షకు బాబు సంఫీుభావం
దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్షకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు తమ పార్టీ ప్రతినిధి డెరెక్‌ ఓబ్రీన్‌  ద్వారా దీదీ సంఫీుభావ సమాచారాన్ని బాబుకు పంపారని తృణమూల్‌ నాయకుడు ఒకరు తెలిపారు. ప్రధానిమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడంలో ప్రతిపక్షం ఐక్యంగా ఉంటుందని, ఈ విషయంలో తాము ముందుంటామని ఈ సందర్భంగా దీదీ స్పష్టం చేశారని తెలిపారు. కేంద్రం తీరును నిరసిస్తూ రాజ్యాంగ పరిరక్షణ పేరుతో కోల్‌కతాలో మమతా బెనర్జీ దీక్ష చేపట్టగా చంద్రబాబు కోల్‌కతా వెళ్లి మరీ తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
Chandrababu
mamatha benerji
delhi deeksha

More Telugu News