Telangana: తెలంగాణలో పారదర్శక మైనింగ్ విధానం.. ఆదాయం ఏకంగా 100 రెట్లు పెరిగింది!: కేటీఆర్

  • 2004-14 మధ్య కేవలం 39.4 కోట్ల ఆదాయం
  • నాలుగేళ్ల టీఆర్ఎస్ కాలంలో రూ.1600 కోట్ల రెవెన్యూ
  • ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

తెలంగాణ ప్రభుత్వం పాటించిన పారదర్శక మైనింగ్ విధానంతో రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట పడిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. సరికొత్త సాంకేతికత, పారదర్శక విధానంతో మైనింగ్ రంగంలో ఆదాయం గణనీయంగా పెరిగిందని వ్యాఖ్యానించారు.

ఉదాహరణకు 2004-14 మధ్యకాలంలో ఏటా రూ.3.94 కోట్ల చొప్పున ప్రభుత్వానికి రూ.39.4 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరిందని అన్నారు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం పాలించిన 2014-18 మధ్యకాలంలో మైనింగ్ రంగంలో ప్రభుత్వ ఆదాయం ఏకంగా రూ.1,600 కోట్లకు చేరుకుందని కేటీఆర్ పేర్కొన్నారు. గతంతో పోల్చుకుంటే మైనింగ్ రంగంలో ప్రభుత్వ ఆదాయం 100 రెట్లు పెరిగిందన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ లో ప్రశంసించారు.

More Telugu News