క్రూడాయిల్ ధర తగ్గినా... స్వల్పంగా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధర!
- లీటర్ పెట్రోలుపై 5 పైసల ధర పెంపు
- 6 పైసల మేరకు పెరిగిన డీజిల్ ధర
- హైదరాబాద్ లో పెట్రోలు రూ. 74.62
ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలను పరిశీలిస్తే, కోల్‌కతాలో పెట్రోలు ధర రూ. 72.44కు, డీజిల్ ధర రూ. 67.40కు చేరగా, చెన్నైలో పెట్రోలు ధర రూ. 73.00కు, డీజిల్ ధర రూ. 69.32కు పెరిగింది. ఇదే సమయంలో బెంగళూరులో పెట్రోలు రూ. 72.65, డీజిల్ రూ. 67.78కు చేరగా, హైదరాబాద్ లో పెట్రోలు ధర లీటర్ రూ. 74.62 డీజిల్ ధర రూ.71.34కు పెరిగింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్ కు 61.67 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 52.17 డాలర్ల వద్ద కొనసాగుతోంది.