MS Dhoni: దటీజ్ ఎంఎస్ ధోనీ... దేశభక్తికి ఫిదా!

  • లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో గౌరవ పదవిలో ధోనీ
  • జాతీయ జెండా నేలను తాకగా, అందుకున్న ధోనీ
  • న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఘటన
క్రికెట్ మ్యాచ్ ఆడే సమయంలో ఎంఎస్ ధోనీ ఎంత అంకితభావంతో ఉంటాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. క్రికెట్ ను పక్కన పెడితే, ధోనీ 'లెఫ్టినెంట్ కల్నల్' హోదాలో భారత సైన్యం గౌరవ పదవిని నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, నిన్న న్యూజిలాండ్ తో మూడో టీ-20 జరుగుతున్న వేళ, జరిగిన ఓ ఘటన ధోనీలోని దేశభక్తిని ప్రపంచానికి చాటింది.

కివీస్‌ ఇన్నింగ్స్‌ జరుగుతున్న సమయంలో ఒక అభిమాని కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకొని మైదానంలోకి దూసుకొచ్చి, నేరుగా ధోనిని చేరుకుని పాదాభివందనం చేశాడు. ఆ సమయంలో అతని చేతిలో ఉన్న భారత జాతీయ జెండా నేలను తాకగా, ఆ వెంటనే ధోనీ దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తరువాతే ఆ అభిమానిని వారించి, పైకి లేపాడు. త్రివర్ణ పతాకం నేలకు తగలకుండా చేసిన ధోనీ దేశభక్తికి ఇప్పుడు ప్రతిఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
MS Dhoni
Flag
India
Newjeland

More Telugu News