చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. గిరిజనులకు 50 ఏళ్ల నుంచే పింఛన్

  • వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం
  • గిరిజనుల పింఛన్ వయో పరిమితి కుదింపు
  • లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాలంటూ ఆదేశాలు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుసపెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా గిరిజనులకు శుభవార్త చెప్పింది. వారి పింఛన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు కుదించింది. ఇకపై 50 ఏళ్లకే వారికి పింఛన్ అందిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాలంటూ ప్రభుత్వం ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేసింది.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
Telugudesam
Pension
tribes

More Telugu News