Aravind Kejriwal: సీఎం కేజ్రీవాల్ కారుపై కర్రలతో దాడి

  • సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నం
  • బీజేపీ నేతలే దాడికి పాల్పడ్డారని ఆరోపణ
  • ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై ఆందోళనకారులు కర్రలతో దాడి చేశారు. నేడు నరేలా ప్రాంతంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు కేజ్రీవాల్ బయల్దేరగా.. సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు కొందరు ఆందోళన కారులు కర్రలతో కేజ్రీవాల్ కారుపై దాడి చేశారు. బీజేపీ నేతలే ఈ దాడికి పాల్పడినట్టు ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Aravind Kejriwal
Delhi
Police
Car

More Telugu News