vallentines day: వాలెంటైన్స్ డే కానుకగా ప్రియా ప్రకాశ్ వారియర్ ‘ఒరు ఆదార్ లవ్’

  • ఈ నెల 14న వాలెంటైన్స్ డే
  • దక్షిణాది భాషల్లో విడుదలకు సిద్ధం
  • ఈ చిత్రం టీజర్ లో హీరోహీరోయిన్ల కిస్ సీన్

స్కూల్ ఏజ్ లోనే ప్రేమ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’. ఈ చిత్రం విడుదల కాకముందే హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ క్రెడిట్ కొట్టేసింది. ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల గత ఏడాదిగా ఆలస్యమవుతూనే ఉంది. విడుదల కాకముందే ప్రియా ప్రకాష్ వారియర్ కు ‘స్టార్’ రేంజ్ పాప్యులారిటీని సంపాదించిపెట్టిన ‘ఒరు ఆదార్ లవ్’ ఈ నెల 14న వాలెంటైన్స్ డే రోజున విడుదల కానుంది.

 ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ లో హీరో రోషన్, హీరోయిన్ ప్రియల మధ్య కిస్ సీన్ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఓ బాలీవుడ్ చిత్రంలో ప్రియ నటిస్తోంది.

More Telugu News