megha choudari: సినిమా ఆపేశారని తెలిసి షాక్ అయ్యాను: 'వర్మ' హీరోయిన్ మేఘా చౌదరి

షార్ట్స్‌లో చూడండి
తమిళంలో 'ధృవ్' కథానాయకుడిగా 'వర్మ' సినిమా నిర్మితమైంది. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన 'అర్జున్ రెడ్డి'కి ఇది రీమేక్. బాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయికగా మేఘా చౌదరి నటించింది. ఈ సినిమా అవుట్ పుట్ పట్ల అసంతృప్తితో పక్కన పెట్టేస్తున్నట్టుగా నిర్మాతలు చెప్పారు. వేరే దర్శకుడితో ఈ సినిమా చేస్తామనీ .. 'ధృవ్'మినహా ఆర్టిస్టులంతా మారిపోతారని ప్రకటించారు.తాజాగా ఈ విషయంపై కథానాయిక మేఘా చౌదరి స్పందిస్తూ .. "ఈ సినిమా రీషూట్ కి సంబంధించిన విషయం తెలిసి షాక్ అయ్యాను. రీ షూట్ కి సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదు. త్వరలో నిర్మాతలతో మాట్లాడతాను" అని చెప్పింది. ధృవ్ కెరియర్ ను దృష్టిలో పెట్టుకుని విక్రమ్ చేసిన సూచనమేరకే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం తమిళనాట జోరుగా జరుగుతోంది. 
Go Back to Shorts
megha choudari

More Telugu News