Krishna District: మాది మానవత్వమున్న ప్రభుత్వం.. ప్రతి ఒక్కరినీ ఆదుకున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు

  • బందరు పోర్టు అభివృద్ధి పనులు ప్రారంభం
  • ఈ పోర్టును అభివృద్ధి చేసే బాధ్యత నాది
  • రాబోయే రోజుల్లో సౌభాగ్యానికి ముఖ ద్వారం బందరు 

ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, తమది మానవత్వమున్న ప్రభుత్వమని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ ఆదుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కృష్ణా జిల్లాలోని బందరు పోర్టు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, ఏడాదిన్నరలో పోర్టు పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ పోర్టును అభివృద్ధి చేసే బాధ్యత తనదని అన్నారు.

ఇప్పటి వరకు పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళుతున్నారని, ఇకపై, భవిష్యత్ లో పనుల కోసం బందరుకు వస్తారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా పోర్టు ఉంటే ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, అదే విధంగా రాబోయే రోజుల్లో సౌభాగ్యానికి ముఖ ద్వారంగా బందరు ఉంటుందని, రాజధాని అమరావతి అభివృద్ధికి ఈ పోర్టు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్రంలో ‘పసుపు-కుంకుమ’ కింద మహిళలకు పది వేల రూపాయల చొప్పున రెండు విడతలు ఇచ్చానని అన్నారు. వారి కన్న తల్లిదండ్రులు ఇవ్వకపోయినా, ఒక అన్నగా వారికి అండగా ఉండాలని, తమది రక్త సంబంధం కాకపోయినా, పూర్వజన్మ బంధంగా భావించి ఒక్కో మహిళకు ఇరవై వేల రూపాయలిచ్చానని అన్నారు.  

More Telugu News