చంద్రబాబు చాలా బాగా మాట్లాడారు: ఆమంచి

  • చంద్రబాబుతో అన్ని విషయాలు చర్చించా
  • ఆయన నుంచి నాకు స్పష్టమైన హామీ వచ్చింది
  • అయినా, అనుచరులతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటా
తెలుగుదేశం పార్టీలో ఉండాలా? లేదా? అనేది సమస్యే కాదని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రితో అన్ని విషయాలు మాట్లాడానని, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత స్పష్టతనిస్తానని చెప్పారు. తాను కాంట్రాక్టులు అడగలేదని... ఏరోజూ అవినీతికి పాల్పడలేదని అన్నారు. చంద్రబాబు చాలా బాగా మాట్లాడారని... ముఖ్యమంత్రి నుంచి తనకు స్పష్టమైన హామీ వచ్చిందని చెప్పారు. తాను ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఇబ్బందుల గురించి సీఎంకు వివరించానని తెలిపారు.

తనకు వ్యతిరేకంగా చీరాలలో కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఆమంచి చెప్పారు. చీరాలలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నారా లోకేష్ వస్తానంటే... కొన్ని శక్తులు వివాదాలు సృష్టించి ఆపేశారని అన్నారు. లోకేష్ వస్తున్నారని ప్రకటనలు ఇచ్చిన తర్వాత కూడా రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. గత 10 రోజులుగా వైసీపీతో చర్చలు జరుపుతున్న సంగతి వాస్తవమేనని తెలిపారు. చంద్రబాబుతో చర్చల తర్వాత సంతృప్తి చెందానని... అయితే, అనుచరులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
amanchi
chirala
Telugudesam
ysrcp

More Telugu News