allu arjun: నా 'కిల్ బిల్ పాండే'ను చూడటం సంతోషంగా ఉంది: అల్లు అర్జున్

  • ఇటీవలే గుండె ఆపరేషన్ చేయించుకున్న బ్రహ్మానందం
  • నిలకడగా ఉన్న బ్రహ్మానందం ఆరోగ్యం
  • ఇంటికెళ్లి కలిసిన అల్లు అర్జున్
ఇటీవలే ముంబైలోని ఓ ఆసుపత్రిలో ప్రముఖ సినీ హాస్య నటుడు బ్రహ్మానందం గుండె అపరేషన్ చేయించుకున్న సంగతి తెలిపిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మరోవైపు, బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఆయనను హీరో అల్లు అర్జున్ కలిశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా బన్నీ వెల్లడించాడు. బ్రహ్మానందం ఉక్కులాంటి మనిషని కితాబిచ్చాడు. బలమైన గుండె కలిగిన వ్యక్తి అని చెప్పాడు. చతురత, నిర్భయం కలగలిసిన వ్యక్తి అని అన్నాడు. నా కిల్ బిల్ పాండేను చూడటం సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు.
allu arjun
Brahmanandam
heart operation
tollywood

More Telugu News