BJP: హెల్మెట్లు ధరించి .. బీజేపీ నేతల దాడికి వినూత్నంగా నిరసన తెలిపిన జర్నలిస్టులు!

  • హెల్మెట్లతో పార్టీ సమావేశానికి హాజరు
  • గత శనివారం జర్నలిస్టుపై విరుచుకుపడ్డ కమలనాథులు
  • చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో ఘటన
ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో ఈరోజు బీజేపీ నిర్వహించిన మీడియా సమావేశంలో విచిత్రం చోటుచేసుకుంది. ఈ సమావేశానికి హాజరైన జర్నలిస్టులందరూ మైక్ లు, కెమెరాలతో పాటు హెల్మెట్లు ధరించి హాజరు అయ్యారు. ఈ విషయమై ఓ సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ.. తమపై గతంలో బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారనీ, ఈసారి కూడా దాడికి దిగితే తప్పించుకోవడానికే ఈ రక్షణ ఏర్పాట్లు చేసుకున్నామని వ్యాఖ్యానించారు.

రాయ్ పూర్ లో గత శనివారం బీజేపీ సమావేశం జరుగుతుండగా, పార్టీ నేతలు గొడవ పడ్డారు. దీన్ని అక్కడే ఉన్న జర్నలిస్ట్ సుమన్ పాండే రికార్డు చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న బీజేపీ నేతలు దాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. పాండేతో పాటు జర్నలిస్టులు ఇందుకు అంగీకరించకపోవడంతో దాడిచేసి ఫోన్ ను బలవంతంగా లాక్కున్నారు. అనంతరం ఆ వీడియోను డిలీట్ చేశారు. దీంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగడంతో సదరు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆ ఘటనపైనే జర్నలిస్టులు ఈరోజు వినూత్నంగా నిరసన తెలిపారు.
BJP
attack
media
journalists
with helmets
chattisgargh
rayapur

More Telugu News