ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు చావు దెబ్బ.. 10 మందిని కాల్చిచంపిన భద్రతాబలగాలు!
- బీజాపూర్ లోని బైరాన్ ఘడ్ లో ఘటన
- కూంబింగ్ చేపడుతుండగా ఎదురుపడ్డ మావోలు
- 11 తుపాకులు, భారీగా మందుగుండు స్వాధీనం
ఈ విషయమై జిల్లా ఎస్పీ మోహిత్ గార్గ్ మాట్లాడుతూ.. బైరాన్ ఘడ్ ప్రాంతంలో ఈరోజు ఎస్టీఎఫ్, డీఆర్జీ సంయుక్త బలగాలు కూంబింగ్ చేపట్టాయని తెలిపారు. ఇంతలోనే మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాల తరఫున ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు. ఘటనాస్థలం నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపును ముమ్మరం చేశామన్నారు.