kolkata: కోల్ కతా సీపీని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న సీబీఐ బృందం

షార్ట్స్‌లో చూడండి
శారదా చిట్ ఫండ్, రోజ్ వ్యాలీ కుంభకోణం కేసుల విషయమై కోల్ కతా పోలీస్ కమిషనర్ (సీపీ) రాజీవ్ కుమార్ ని ప్రశ్నించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది. సీబీఐలో డీఎస్పీ ర్యాంకు అధికారి అయిన తథాగత బర్దన్ ఈ బృందానికి నేతృత్వం వహించనున్నారు. అయితే, ఏ తేదీన రాజీవ్ కుమార్ ని సీబీఐ అధికారుల బృందం ప్రశ్నిస్తుందన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. కాగా, ఈ నెల 8న తాను అందుబాటులో ఉంటానని రాజీవ్ కుమార్ ఇప్పటికే సీబీఐకు లేఖ ద్వారా తెలిపారు.
Go Back to Shorts
kolkata
cp
rajiv kumar
cbi
tadha gath bardhan

More Telugu News