YSRCP: వచ్చే ఎన్నికల్లో మా పార్టీని గెలిపిస్తే వృద్ధుల పింఛన్ రూ.3 వేలు చేస్తాను: జగన్ హామీ

  • వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కరితోనే పోటీ కాదు
  • ఎల్లో మీడియా, అన్యాయాలతో కూడా పోరాడాలి
  • ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే వృద్ధులకు ఇచ్చే పింఛన్ ను రెండు వేల నుంచి మూడు వేల రూపాయలకు పెంచుతామని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. తిరుపతిలో నిర్వహించిన ‘సమర శంఖారావం’లో ఆయన ఈ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కరితోనే పోటీ కాదని, ఎల్లో మీడియా, అన్యాయం, మోసాలతో కూడా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, ఏప్రిల్ లో ఎన్నికలు ఉంటాయని, ఈ రెండు నెలలు అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఓటరు ఓటు వేసేలా బూత్ కమిటీలు బాధ్యత తీసుకోవాలని, చంద్రబాబు ప్రలోభాలకు లోనుకాకుండా చూడాలని అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు గెలవడంతో తన రెండో సినిమా ప్రారంభించారని, రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రతి కాంట్రాక్టులోనూ చంద్రబాబుకు కమీషన్లు అందుతున్నాయని ఆరోపించారు.

More Telugu News