art dealer: స్నేహితుడితో హాలీవుడ్ హీరోయిన్ జెన్నిఫర్ లారెన్స్ నిశ్చితార్థం!

  • త్వరలోనే పెళ్లి తేదీపై ప్రకటన
  • స్నేహితుడి ద్వారా పరిచయమైన మరోనీ
  • 2012లో ఆస్కార్ అందుకున్న జెన్నిఫర్
ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్(28) నిశ్చితార్థం జరిగిపోయింది. అమెరికన్ ఆర్ట్ డీలర్, స్నేహితుడు కూక్ మరోనీ(34)తో జెన్నిఫర్ నిశ్చితార్థం జరిగినట్లు ఆమె అధికార ప్రతినిధి తెలిపారు. వీరి వివాహ తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. స్నేహితురాలు లౌరా సింప్సన్ ద్వారా జెన్నిఫర్ కు గతేడాది మరోనీ పరిచయమయ్యాడు. ఇది కాస్తా ప్రేమగా మారడంతో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. మరోనీ న్యూయార్క్ లోని గ్లాడ్ స్టోన్ గ్యాలెరీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.

2012లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’తో ఉత్తమ నటిగా జెన్నిఫర్ ఆస్కార్ అవార్డును అందుకుంది. ఎక్స్ మెన్, హంగర్ గేమ్స్ వంటి సీక్వెల్స్ లో నటించి మెప్పించింది. మహిళలకు సమాన హక్కులు ఉండాలంటూ గాయని అడాలే, నటి కామెరూన్ డియాజ్ తో కలిసి ‘మార్చ్ టు లాజ్ ఏంజెలిస్’ కార్యక్రమంలో పాల్గొంది. 2016 ఫోర్బ్స్ జాబితా ప్రకారం జెన్నిఫర్ లారెన్స్ ఏటా రూ.329.22 కోట్లు(46 మిలియన్ అమెరికన్ డాలర్లు) అర్జిస్తోంది.
art dealer
hollywood
jennifer lawrence
cook maroney
engagement

More Telugu News