chigurupati jayaram: జయరాం హత్య కేసులో ఆరోపణల ఎఫెక్ట్.. ఇబ్రహీంపట్నం ఏసీపీపై చర్యలు

  • మల్లారెడ్డిని  పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్
  • మల్లారెడ్డిపై ఆరోపణలు నిజమని తేలితే తగు చర్యలు
  • రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఉత్తర్వులు
ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాంను హత్య చేసిన అనంతరం ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డికి ఫోన్ చేసినట్టు ఏపీ పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీపీ మల్లారెడ్డిపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ చర్యలు చేపట్టారు. మల్లారెడ్డిని అంబర్ పేటలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మల్లారెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, ఇబ్రహీంపట్నం ఏసీపీ బాధ్యతలను చూడాలంటూ వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
chigurupati jayaram
rakesh reddy
acp mallareddy
rachakonda cp
mahesh bhagawath
amberpet

More Telugu News