chigurupati jayaram: జయరాం హత్య కేసులో మరో మలుపు.. శిఖా చౌదరిపై జయరాం భార్య ఫిర్యాదు

  • శిఖా చౌదరిపై అనుమానాలు ఉన్నాయంటూ ఫిర్యాదు
  • ఈ హత్యలో శిఖా చౌదరి పాత్రను తేల్చాలని వినతి
  • ఈ కేసుపై తెలంగాణ పోలీసులే విచారణ జరపాలన్న పద్మశ్రీ
ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. ఈ హత్యకు సంబంధించి శిఖా చౌదరిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యాదు చేశారు. తన తండ్రి పిచ్చయ్యతో పాటు తన లాయర్ ను వెంట తీసుకుని హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పద్మశ్రీ ఫిర్యాదు చేశారు.

తన భర్త హత్య కేసులో మరిన్ని కుట్రలు ఉన్నాయని, దీనిపై విచారణ జరపాలని ఆమె కోరినట్టు సమాచారం. ఈ హత్యలో శిఖా చౌదరి పాత్రను తేల్చాలని, ఈ హత్య తెలంగాణలో జరిగింది కనుక ఇక్కడి పోలీసులు దీనిపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.
chigurupati jayaram
padma sri
rakesh reddy

More Telugu News