రాజ్‌నాథ్‌కు నివేదిక పంపిన పశ్చిమబెంగాల్ గవర్నర్
- కేసరినాథ్ త్రిపాఠితో ఫోన్ లో మాట్లాడిన రాజ్ నాథ్
- రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చ
- నివేదిక పంపాలంటూ సూచన
శారదా కుంభకోణం కేసులో కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను విచారించేందుకు సీబీఐ అధికారులు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులను రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ముఖ్యమంత్రి మమత బెనర్జీ ధర్నాకు దిగారు. దీంతో, ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.