మాకు మద్దతు ఇచ్చినందుకు నాగబాబుగారికి ధన్యవాదాలు: యాంకర్ రష్మి
- ఎవరి వస్త్రధారణ వాళ్ల ఇష్టం
- గొప్పతనాన్ని దుస్తుల వైపు నుంచి చూడకండి
- నాగబాబు సార్ మాకు మద్దతుగా నిలిచారు
మగవారి వస్త్రధారణ విషయంలో ఆడపిల్లలు ఎప్పుడూ అభ్యంతరాన్ని తెలియజేయలేదనే విషయాన్ని గుర్తుచేశారు. పాత సంప్రదాయాలను పట్టుకుని వేళ్లాడటం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాగబాబు ఇలా మాట్లాడటం పట్ల యాంకర్ రష్మి హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఆ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. "వేసుకునే దుస్తులకు మించి మనిషిలో ఎన్నో గొప్ప విషయాలు ఉంటాయి. ఆ గొప్పతనాన్ని వాళ్లు వేసుకునే దుస్తుల వైపు నుంచి చూడకండి. మాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు నాగబాబు సార్" అంటూ ట్వీట్ చేసింది.