కోల్ కతాలో జరుగుతున్న పరిణామాలను పార్లమెంటులో లేవనెత్తండి: ఎంపీలకు బాబు ఆదేశం
- బీజేపీని ఎదిరిస్తున్న నేతలపై కేసులు పెడుతున్నారు
- ఇప్పుడు మమతా బెనర్జీపై కక్ష సాధింపులకు దిగుతున్నారు
- జరుగుతున్న పరిణామాలపై పార్లమెంటులో నిలదీయండి
కోల్ కతాలో జరుగుతున్న పరిణామాలపై పార్లమెంటులో లేవనెత్తాలని టీడీపీ ఎంపీలను చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోకుండా... నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అధికారులు చేస్తున్న నిర్వాకంపై పార్లమెంటులో నిలదీయాలని సూచించారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై కేసులు పెట్టి బీజేపీ నేతలు ఆనందిస్తున్నారని మండిపడ్డారు.