మోదీ, మమత ఇద్దరూ దొందూ దొందే: సీతారాం ఏచూరి
- చౌకీదార్ మోదీ దేశాన్ని దోచేస్తున్నారు
- మమతా బెనర్జీ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు
- మోదీని గద్దె దించే సమయం ఆసన్నమైంది
పాలసీల పేరుతో ఇన్నాళ్లూ ప్రజలను దోచుకుతిన్న మోదీ ఎన్నికలు దగ్గరపడగానే ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నారని సీతారాం ఏచూరి మండిపడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రజల జేబులకు కన్నాలు పెడుతున్నారని ఆరోపించారు.