egypt: ఈజిప్టులో 40కి పైగా మమ్మీల గుర్తింపు

  • మమ్మీలలో 12 మంది చిన్నారులు, ఆరు జంతువులు
  • కైరోకు 260 కిలోమీటర్ల దూరంలో మమ్మీల గుర్తింపు
  • గత ఫిబ్రవరి నుంచి తవ్వకాలు జరుపుతున్న పురాతత్వశాఖ అధికారులు

ఈజిప్టులో 40కి పైగా మమ్మీలను పరిశోధకులు గుర్తించారు. మధ్య ఈజిప్టు ప్రాంతంలోని ఓ పురాతన శ్మశానవాటికలో వీటిని కనుగొన్నారు. ఈ ప్రాంతం కైరోకు దక్షిణ దిశగా 260 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మమ్మీలు టాలెమాయిక్ కాలానికి చెందినవని ఈజిప్టు పురాతత్వ శాఖ తెలిపింది. తాజాగా బయటపడిన మమ్మీలలో పెద్దలు, పిల్లలతో పాటు జంతువులు కూడా ఉన్నాయి.

ఈ సందర్భంగా పురాతత్వ శాస్త్రవేత్త రమీ రస్మీ మాట్లాడుతూ, తాము గుర్తించిన మమ్మీలలో 12 మంది చిన్నారులు, ఆరు జంతువులు కూడా ఉన్నాయని చెప్పారు. మిగిలిన వారిలో పురుషులు, మహిళలు ఉన్నారని తెలిపారు. మరో పురాతత్వ శాస్త్రవేత్త మొహమ్మద్ రగబ్ మాట్లాడుతూ, భూమికి తొమ్మిది మీటర్ల లోతున రెండు సమాధులను కనుగొన్నామని... వీటిలో ఆరుకు పైగా గదులు ఉన్నాయని చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి మిన్యా సమాధులు ఉన్న ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలను చేపట్టారు. ఈ సమాధులు బూర్జువా కుటుంబాలకు చెందినవై ఉండవచ్చని భావిస్తున్నారు.

More Telugu News