jabardast: ఈ ‘స్కిట్’ కంటెంట్ నాది.. మీకు నచ్చిన పేరు డిసైడ్ చేయండి: నాగబాబు

  • ఈరోజు చిన్నసైజ్ స్కిట్ ఒకటి చేస్తున్నాం
  • ఈ స్కిట్ కు నేను పేరు పెట్టలా
  • ఈ స్కిట్ ను మీరు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా

‘జబర్దస్త్’ జడ్జి, ప్రముఖ నటుడు నాగబాబు ఓ స్కిట్  చేశారు. ‘అంతా నా ఇష్టం’ అంటూ యూట్యూబ్ లో ఈ స్కిట్ ను నాగబాబు పోస్ట్ చేశారు. ‘హలో ఫ్రెండ్స్.. వెల్ కమ్ టూ ‘మై ఛానెల్ నా ఇష్టం’. ఈరోజు చిన్నసైజ్ స్కిట్ ఒకటి చేస్తున్నాం. ఎందుకంటే, జబర్దస్త్ వాళ్లం కదా.. అయితే, ఈ స్కిట్ కు నేను పేరు పెట్టలా. కంటెంట్ నాది.. పేరు మీది. మీకు నచ్చిన పేరు మీరు డిసైడ్ చేసి చెప్పండి. ఐ థింక్ యు ఎంజాయ్ దిస్ స్మాల్ స్కిట్. రెడీ టూ వాచ్’ అని నాగబాబు ఆ వీడియోలో పేర్కొన్నారు.

‘గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్.. ఈరోజు మీకొక పరీక్ష పెట్టబోతున్నాను. 2019లో చాలా ఇంపార్టెంట్ పరీక్ష. ఈ పరీక్షలో మీ ఇద్దరూ డిస్టింక్షన్ తెచ్చుకోవాలని నా కోరిక... మీరు కనుక డిస్టింక్షన్ తెచ్చుకుంటే మన రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగం. ఇవాల్టి టాపిక్ ఏంటంటే ‘నేను- నా అవినీతి’. దానికి సంబంధించిన డీటైల్స్ మొత్తం రాయండి’ అంటూ నాగబాబు అనడం ఈ స్కిట్ లో కనబడుతుంది. 

More Telugu News