పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ యూటీఎఫ్ మహా పాదయాత్ర
- రేపటి నుంచి మూడు రోజులపాటు నిర్వహణ
- కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దుకు డిమాండ్
- ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి
గుంటూరు, ఏలూరు నుంచి రెండు బృందాలుగా ఉపాధ్యాయులు ఈ పాదయాత్ర చేపట్టి విజయవాడలో కలిసేటట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత విధానంలోకి రావాలని ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సెషన్లోనే ఇందుకు అవసరమైన నిర్ణయం తీసుకోవాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.