భానుప్రియ కేసులో కొత్త ట్విస్ట్... మైనర్ బాలిక, ఆమె తల్లి అరెస్ట్!

02-02-2019 Sat 09:12
  • భానుప్రియ కుటుంబీకులపై ఫిర్యాదు
  • తప్పుడు ఫిర్యాదేనని తేల్చిన పోలీసులు
  • మరింత లోతుగా విచారణ
ప్రముఖ సినీనటి భానుప్రియ ఇంట్లో తన కుమార్తె వేధింపులకు గురవుతోందని, ఆమె సోదరుడు లైంగికంగానూ వేధిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసిన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ప్రభావతి కేసులో ఇది ఓ ట్విస్ట్. భానుప్రియ ఇంట బాలిక వేధింపులకు గురి కాలేదని, తల్లి ప్రోద్బలంతో దొంగతనానికి పాల్పడి, ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు ఈ ఆరోపణలను తెరపైకి తెచ్చారని తేల్చిన పోలీసులు, వారిద్దరినీ అరెస్ట్ చేశారు.

ఆ బాలిక బీరువా తాళాలు ఎక్కడ పెడతారో గమనించి రూ. 1.50 లక్షల నగదు, నగలు దొంగిలించి తల్లికి ఇచ్చిందని, ఆపై భానుప్రియ కుటుంబీకులు నిలదీస్తే, నేరం అంగీకరించి నగలను వెనక్కు తెచ్చిందని పోలీసులు తెలిపారు. మిగతా డబ్బు అడుగుతారని భావించి, తప్పుడు కేసును పెట్టారని, వారిద్దరినీ మరింత లోతుగా విచారిస్తున్నామని అన్నారు.