balakrishna: బోయపాటి మూవీలో ముఖ్యమంత్రిగా బాలయ్య?

  • బాలకృష్ణ నెక్స్ట్ మూవీ బోయపాటితో
  • గతంలో ఇద్దరి కాంబినేషన్లో రెండు హిట్లు
  • ఈ నెలలోనే మూడో సినిమా లాంచ్    

ప్రస్తుతం బాలకృష్ణ 'మహానాయకుడు' సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే పనిలో వున్నారు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తరువాత బాలకృష్ణ .. బోయపాటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన పనుల్లోనే బోయపాటి తీరిక లేకుండా వున్నాడు.

గతంలో బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్లో 'సింహా' .. 'లెజెండ్' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాల్లోను బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇప్పుడు బోయపాటి చేయనున్న సినిమాలోను బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఒక పాత్రలో ఆయన ముఖ్యమంత్రిగా కనిపించనున్నారని చెప్పుకుంటున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఇక ప్రతినాయకుడు ఎవరు? కథానాయికలు ఎవరు? అనే విషయాలతో పాటు మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

More Telugu News