'ఎఫ్ 3'లో రవితేజ గురించి దిల్ రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎఫ్ 3'లో రవితేజ గురించి దిల్ రాజు

  • 'ఎఫ్ 2' మా అంచనాలు కూడా దాటిపోయింది
  •  'ఎఫ్ 3' తప్పకుండా ఉంటుంది
  •  2021లో విడుదల చేసే ఆలోచన వుంది  
దిల్ రాజు నిర్మాణంలో క్రితం నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఎఫ్ 2' భారీ విజయాన్ని అందుకుంది. జనవరి 12వ తేదీన థియేటర్లకి వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా ఇంకా తన దూకుడును కొనసాగిస్తూనే వుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి దిల్ రాజు మాట్లాడారు.

'ఈ సినిమాకి సీక్వెల్ గా 'ఎఫ్ 3' ఉంటుందనీ .. అందులో రవితేజ కూడా ఉంటాడనే ప్రచారం జరుగుతోంది .. దీనిపై మీరు ఏమంటారు?' అనే ప్రశ్న దిల్ రాజుకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. 'ఎఫ్ 3' సినిమా తప్పకుండా ఉంటుంది .. ఈ సినిమాను 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఆలోచన చేస్తున్నాను. ఇందులో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లతో పాటు మరో హీరో ఉంటాడు. అయితే అది రవితేజనా .. మరొకరా అనేది ఇప్పుడే చెప్పలేను. స్క్రిప్ట్ ఫైనల్ అయిన తరువాత ఒక నిర్ణయానికి వస్తాము' అని అన్నారు. 
Dil Raju

More Telugu News