విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో పాము.. షాక్ అయిన ఉపాధ్యాయులు!
- పౌష్టికాహారంగా ప్రతిరోజూ కిచిడీ
- తినకపోవడంతో తప్పిన ప్రమాదం
- విచారణకు ఆదేశించిన అధికారులు
అయితే తాజాగా ఆ పాఠశాలలో విద్యార్థులకు కిచిడీ వడ్డిస్తుండగా.. అందులో ఓ పాము కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే కిచిడీని వడ్డించడం ఆపేశారు. విద్యార్థులెవరూ దానిని తినకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ఈ విషయాన్ని అక్కడి ఉపాధ్యాయులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. దీనిపై విచారణకు ఆదేశించారు. నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.